సంగతి న్యూస్, చెన్నై: కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీఎర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్షలు చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో దేశ రాజకీయాలకు భారంగా మారారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రతిపక్ష హోదాలో కొనసాగలేదని అన్న ఆయన ఇకపై ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
బుధవారం చెన్నైలో శివనాడార్ ఫౌండేషన్ వారి ఇగ్నిషన్ సదస్సుకు హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి దూరదృష్టి కొరవడిందని అందుకే ప్రతిపక్షాన్ని నడిపించడం ఆయనవల్ల కాదన్నారు. ఆర్థిక, ఉద్యోగ, పరిశ్రమలు, అభివృద్ధివంటి అంశాలపై ఇప్పటి వరకు ఆయనకు స్పష్టమైన విధానాలు లేవని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం ప్రధాని మోదీకి బాగా కలిసి వస్తుందన్నారు. దక్షిణాధి రాష్ట్రాల్లో బీజేపీ అడుగు పెట్టడం సాధ్యం కాదని, కచ్చితంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలు ఆ పార్టీకి అవకాశం ఇవ్వరని విశ్వాసం వ్యక్తి చేశారు.
Add A Comment
