సంగతి స్పోర్ట్స్ విభాగం: దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ కు టీమ్ ఇండియా గట్టిగా బదులిచ్చింది. భారత్ ఆటగాళ్లను అవమానించినట్లు వ్యాఖ్యలు చేసిన ఆయనకు తాజా విజయంతో బుద్ధి చెప్పినట్లయింది. లెక్కసరిపోయిందా అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వండేలో 9 వికెట్ల తేడాతో భారత్ తేలికగా దక్షిణాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా గత సిరీస్ సందర్భంలో షుక్రీ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. గత రెండు టెస్టుల సిరీస్ దక్షిణాఫ్రికా గెలుచుకున్న సందర్భంలో మీడియాతో మాట్లాడినప్పుడు భారత క్రికెటర్లను అవమానించేలా మాట్లాడాడు.
ఆ మ్యాచ్లో భారత ప్లేయర్లు ఎక్కువ సేపు తమ మొకాళ్లపై మైదానంలోనే ఎదురుచూసేలా చేసేందుకే ఆ మ్యాచ్ ను డిక్లేర్ చేయలేదని వ్యాఖ్యానించారు. ఆ మాటలపై నెటిజన్లతోపాటు ప్రముఖ క్రికెట్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా దక్షిణాఫ్రికాను మట్టి కరిపించడం గట్టి బదులిచ్చినట్లయిందని సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు “నోటి దూల.. లెక్కసరిపోయిందిగా” అని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Add A Comment
