ముంబై మేయర్ పీఠంపై సంజయ్ రౌత్
ముంబై: మేయర్ పీఠంపై తమ పోరు ఇంకా ముగియలేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. సోమవారం జాతీయ చానెల్ ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ బొంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 సీట్లతో మెజారిటీ పొందినప్పటికీ మేయర్ పీఠం పోరు ముగిసినట్లు కాదని చెప్పారు. ఇప్పటికే మిత్రపక్షాలతో తమ బలం 108కు చేరిందని, మెజారిటీ తాము కేవలం ఆరు సీట్ల దూరంలో ఉన్నామన్నారు.
శివసేన కార్పొరేటర్లను షిండే వర్గం హోటళ్లకు తరలించడంపై రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. “మీరు వ్యక్తులను బంధించొచ్చు కానీ వారి ఆలోచనలను కాదు. ముంబైలో బీజేపీ మేయర్‌ను ఎవరూ కోరుకోవడం లేదు,” అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పార్టీ మార్పిడిని నివారించేందుకే కార్పొరేటర్లను శిక్షణా శిబిరానికి తీసుకెళ్లామని షిండే వర్గం చెబుతోంది.
