సంగతి, భద్రాద్రికొత్తగూడెం: మిస్ టీన్ తెలంగాణగా భద్రాద్రి జిల్లా అమ్మాయి నిలిచింది. రాజస్థాన్లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన ఫేవరెట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీల్లో భద్రాచలం పట్టణానికి చెందిన ప్రీతి యాదవ్ నిలిచింది.
పట్టణానికి చెందిన ప్రకాశ్ యాదవ్, రేణు దంపతుల కుమార్తె ప్రీతి. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆమె తండ్రి పానీపూరి బండి నడుపుతుండగా తల్లి రేణుకు మోడలింగ్ రంగంపై అనుభవం ఉంది. దీంతో తన కుమార్తెను మోడలింగ్ పోటీలకు సిద్ధం చేసేది. ఈ పోటీలకు ఏడాది క్రితమే ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలవగా దేశవ్యాప్తంగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Add A Comment
