సంగతి, న్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్లు, సినీ నటులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ కేసులో మొత్తం రూ. 7.93 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈడీ వివరాల ప్రకారం, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చెందిన వైడబ్ల్యూసీ (హెల్త్ అండ్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థ ద్వారా రూ. 2.5 కోట్లు, నటి నేహా శర్మ రూ. 1.26 కోట్లు, నటుడు అంకుష్ హజ్రావి రూ. 47.2 లక్షలు, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పవి రూ. 8.26 లక్షలు, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వి రూ. 1 కోటి, ఇతరులవి కొన్ని తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ ప్రముఖులందరినీ గతంలో ఈడీ విచారించిందని, అటాచ్ చేసిన ఆస్తులన్నీ అక్రమ బెట్టింగ్ యాప్ వన్ ఎక్స్ బెట్ ద్వారా వచ్చినట్లు భావిస్తున్నామని తెలిపింది.
ఇదే కేసులో గత నెల నవంబర్లో, మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్ కు చెందిన రూ. 4.55 కోట్ల ఆస్తులు, సురేశ్ రైనా కు సంబంధించిన రూ. 6.64 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అక్రమ బెట్టింగ్ యాప్ లపై పలు రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Add A Comment
