సంగతి న్యూస్, బెంగళూరు: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. బెంగళూరు పబ్లో అసభ్య కరమైన విధంగా మిడిల్ ఫింగర్ చూపించి వివాదం మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నవంబర్ 28న అశోకనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పబ్లో జరిగిన ఘటనలో పబ్ బాల్కనీ నుంచి క్రింద ఉన్న జనాలకు ఆర్యన్ ఖాన్ మధ్యవేలు చూపించినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఆయనతోపాటు కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్, ఎమ్మెల్యే హారీస్ కుమారుడు మొహమ్మద్ నలపాడ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్యన్ ఖాన్ ఈ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది నెటిజన్లు బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Add A Comment
